
Rohit Shrama: శార్దూల్ ఠాకూర్ కూడా అందుకు అర్హుడు: రోహిత్ శర్మ
(Photo:Bcci Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన శార్దూల్ ఠాకూర్ కూడా ఈ అవార్డుకు అర్హుడని రోహిత్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-1తో అధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(127) సెంచరీ చేయగా.. శార్దూల్ ఠాకూర్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ శతకాలు బాది టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
‘సిరీస్‌లో 2-1తో అధిక్యం నిలవడం సంతోషంగా ఉంది. ఇది మేం ఇప్పటివరకు చేసిన కృషిని చూపుతుంది. ఇక్కడితో ముగియలేదు. మాంచెస్టర్‌లో మరో టెస్టు ఉంది. ఈ సిరీస్‌లో మేం ఇప్పటివరకు కొన్ని అద్భుతమైన ఘనతలు సాధించాం. మరింతగా రాణిస్తామనే నమ్మకం నాకుంది. అందు కోసం ఇదే పద్ధతిలో ముందుకు సాగాలి. శార్దూల్ ఠాకూర్ టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. నిజాయితీగా చెప్పాలంటే.. అతడు చేసిన ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కి అర్హుడు’ అని రోహిత్ శర్మ అన్నాడు.
‘మేం అతడి బ్యాటింగ్‌ని ఎలా మార్చిపోగలం. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 31 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అంతేకాదు కీలక సమయంలో జో రూట్‌ని ఔట్ చేశాడు. శార్దూల్‌కి బ్యాటింగ్ చేయడం అంటే ఇష్టం. బాగా ఆడటం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అవును. నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. కానీ, శార్దూల్ కూడా అందులో భాగమై ఉండాలని మానస్ఫూర్తిగా భావించా’ అని హిట్ మ్యాన్ ముగించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.