arshdeep: ఉమ్రాన్‌ ఓకే.. మరి అర్ష్‌దీప్‌ సంగతేంటి?

 డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో యువ భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌

Published : 28 Jun 2022 02:08 IST

(Photo: Arshdeep Singh Instagram)

ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో యువ భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ని తుది జట్టులో ఆడించకపోవడంపై సోషల్‌ మీడియాలో పలువురు అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రస్తుత జట్టులో ఉన్న ఏకైక లెఫ్ట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌  అర్ష్‌దీప్‌ అని,  అతడు డెత్‌ ఓవర్లలో అద్భుతమైన యార్కర్లు వేయగలడని  అంటున్నారు.  డబ్లిన్‌ పిచ్‌పై అతడు బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం ఇవ్వడంతో అర్ష్‌దీప్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీస్తున్నారు. అయితే,  రెండో టీ20కైనా అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కాగా, అర్ష్‌దీప్‌ ఇటీవల పూర్తి అయిన భారత టీ20 లీగ్‌లో పంజాబ్‌ తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 7.70 మేటి ఎకానమి నమోదు చేశాడు.  దీంతో అతడిని దక్షిణాఫ్రికాతో పాటు, ఇప్పుడు ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని