IND vs NZ: కెమెరా వల్ల ఆగిపోయిన మ్యాచ్‌.. భారత ఆటగాళ్లు ఏం చేశారో చూడండి!

సాధారణంగా వర్షం వస్తేనో, వెలుతురు తక్కువ ఉన్న సందర్భాల్లో క్రికెట్ మ్యాచ్‌లను మధ్యలో నిలిపివేస్తారు. కుక్కలు, పిల్లులు వంటివి మైదానంలోకి పరుగెత్తుకుని వచ్చినప్పుడు కూడా మ్యాచ్‌లను ఆపేసిన ఘటనలున్నాయి. అభిమానులు, ఆకతాయిలు గ్రౌండ్‌లోకి

Published : 06 Dec 2021 01:21 IST

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా వర్షం వస్తేనో, వెలుతురు తక్కువ ఉన్న సందర్భాల్లో క్రికెట్ మ్యాచ్‌లను మధ్యలో నిలిపివేస్తారు. కుక్కలు, పిల్లులు వంటివి మైదానంలోకి పరుగెత్తుకుని వచ్చినప్పుడు కూడా మ్యాచ్‌లను ఆపేసిన ఘటనలున్నాయి. అభిమానులు, ఆకతాయిలు గ్రౌండ్‌లోకి అనుహ్యంగా పరుగెత్తుకొచ్చినప్పుడు కూడా ఆటను నిలిపేసిన ఘటనలనూ చూశాం. కానీ, ఇందుకు భిన్నంగా ఒక కెమెరా వల్ల మ్యాచ్‌ని ఆపేయాల్సి వచ్చింది. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్ (6) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ సమయంలో మ్యాచ్‌ని చిత్రీకరించేందుకు ఉపయెగించే స్పైడర్‌ కెమెరా పిచ్‌కి కొంత ఎత్తులో ఎటూ కదలకుండా ఆగిపోయింది. వెంటనే మైదానం సిబ్బంది.. దాన్ని పైకి లాగేందుకు ప్రయత్నించారు. కానీ, అది సాధ్యం కాలేదు. ఈ సమస్యని పరిష్కరించడానికి కొంత సమయం అవసరమైంది. దీంతో ఏం చేయాలో తోచక నిర్ణీత సమయానికంటే ముందుగానే అంపైర్లు టీ విరామం ప్రకటించారు. 

కెమెరాతో సరదాగా ఆడుకున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు

స్పైడర్‌ కెమెరా ఆగిపోవడంతో మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు సరదాగా ఆడుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కెమెరాకు ముందు ఉండే అద్దాన్ని టచ్‌ చేసి ‘ఏయ్‌.. ఏమైంది. పైకి పో.. పైకి పో’ అంటూ సరదాగా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. బహుబలిలో ప్రభాస్‌ శివలింగాన్ని ఎత్తుకున్నట్టున్నట్టుగా పోజులిస్తూ కెమెరాని పైకి నెట్టేందుకు ప్రయత్నించాడు. సూర్యకుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా కెమెరా ముందు కాసేపు నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో ఉన్న మరికొన్ని ఫోటోలను చూసేయండి!

Read latest Sports News and Telugu News







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని