IND vs NZ: మయాంక్ అర్ధ శతకం.. అజాజ్‌కు మూడు వికెట్లు

ముంబయి వేదికగా న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు రెండో సెషన్‌ ముగిసింది. ఔట్ ఫీల్డ్‌ తడిగా ఉండటంతో తొలి సెషన్‌ను నిర్వహించలేదు. 37 ఓవర్ల పాటు..

Updated : 03 Dec 2021 14:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి వేదికగా న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు రెండో సెషన్‌ ముగిసింది. ఔట్ ఫీల్డ్‌ తడిగా ఉండటంతో తొలి సెషన్‌ను నిర్వహించలేదు. 37 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్‌లో ఇరు జట్లు సమంగా నిలిచాయి. భారత్ మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్ (52) అర్ధ శతకంతో రాణించాడు. 27 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడుతున్న భారత్‌కి.. ఆ తర్వాతి ఓవర్లో అజాజ్‌ పటేల్ షాకిచ్చాడు. క్రీజులో కుదురుకున్న శుభ్‌మన్‌ గిల్‌ (44)ని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛెతేశ్వర్ పుజారా (0), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (0)లను కూడా అజాజ్‌ పటేల్‌ వేసిన 30వ ఓవర్లో ఔట్ చేశాడు. ఆ ఓవర్‌ రెండో బంతికి పుజారా బౌల్డ్ కాగా, ఆఖరు బంతికి కోహ్లి వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే భారత్‌ మూడు వికెట్లు కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ (7) క్రీజులో ఉన్నాడు. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్ మూడు వికెట్లు తీశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని