Updated : 03 Dec 2021 10:11 IST

IND vs NZ: రెండో టెస్టుకు దూరమైన కీలక ఆటగాళ్లు.. ఎవరెవరంటే..? 

ముంబయి: మరికాసేపట్లో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్టులో టీమ్‌ఇండియా కీలక ఆటగాళ్లను పక్కనపెట్టింది. ఊహించినట్టే గతకొంత కాలంగా ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న వైస్‌ కెప్టెన్‌ అజింక్య రాహానెను జట్టు యాజమాన్యం ఈ మ్యాచ్‌కు దూరంపెట్టింది. అలాగే కాన్పూర్‌ టెస్టులో ఒక అర్ధశతకం, ఐదు వికెట్లతో చెలరేగిన కీలక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో సహా అదే టెస్టులో ఏమాత్రం ప్రభావం చూపని సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మను రెండో టెస్టుకు దూరం చేసింది. గాయాల కారణంగా వీరిని పక్కనపెట్టినట్లు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. కాగా, వీరి స్థానాల్లో ఎవరెవరు బరిలోకి దిగుతారని స్పష్టం చేయలేదు. ఇక రహానె స్థానంలో కెప్టెన్‌ కోహ్లీ బరిలోకి దిగనుండటం తెలిసిందే. మరోవైపు వాంఖడే స్టేడియం ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటంతో అంపైర్లు టాస్‌ను ఆలస్యం చేశారు. అలాగే న్యూజిలాండ్‌ జట్టులో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని