IND vs NZ: తొలిరోజు ఆటపూర్తి.. శతకంతో కదం తొక్కిన మయాంక్

ముంబయి వేదికగా న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు ఆట పూర్తయ్యింది. రెండో సెషన్‌ స్కోరు 111/3తో బ్యాటింగ్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. మూడో..

Updated : 03 Dec 2021 19:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి వేదికగా న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయ్యింది. రెండో సెషన్‌ స్కోరు 111/3తో బ్యాటింగ్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. మూడో సెషన్‌లో ఒక వికెట్ కోల్పోయి మరో 110 పరుగులు జత చేసింది. దీంతో మెదటి రోజు 70 ఓవర్ల పాటు సాగిన ఆటలో భారత్‌ 221/4 స్కోరుతో నిలిచింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (120: 246 బంతుల్లో 14x4, 4x6) శతకంతో రాణించాడు. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్ సాహా (25: 53 బంతుల్లో 3x4, 1x6) క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (44: 71 బంతుల్లో 7x4, 1x6) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ‘టెస్టు స్పెషలిస్ట్‌’ ఛెతేశ్వర్ పుజారా (0), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. శ్రేయస్‌ అయ్యర్‌ (18) పరుగుల వద్ద ఉండగా.. అజాజ్‌ పటేల్ వేసిన 48వ ఓవర్‌లో టామ్ బ్లండల్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్ నాలుగు వికెట్లు తీశాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని