IND vs NZ : శుభ్‌మన్‌ హాఫ్‌ సెంచరీ.. భారత్‌ 82/1

ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌; 87 బంతుల్లో 5x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు....

Updated : 25 Nov 2021 12:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా భోజన విరామ సమయానికి 82/1తో నిలిచింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌; 87 బంతుల్లో 5x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. అతడికి పుజారా (15; 61 బంతుల్లో ) తోడుగా ఉన్నాడు. జట్టు స్కోర్‌ 21 పరుగుల వద్ద మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (13; 28 బంతుల్లో 2x4) ఔటయ్యాడు. అతడు జేమీసన్‌ బౌలింగ్‌లో కీపర్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆపై గిల్‌, పుజారా నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు 127 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే శుభ్‌మన్‌.. 26 ఓవర్లో సోమర్‌ విల్లే వేసిన మూడో బంతికి సింగిల్‌ తీసి టెస్టుల్లో నాలుగో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో తొలి సెషన్‌లో భారత్‌దే పైచేయిగా నిలిచింది. మరోవైపు టాస్‌ ఓడి బౌలింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఈ సెషన్‌లో  ఒక వికెట్‌తోనే సరిపెట్టుకుంది.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని