IND vs NZ: వాంఖడే పిచ్ క్యూరేటర్‌కు టీమ్‌ఇండియా నగదు బహుమతి
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించిన అనంతరం జట్టు యాజమాన్యం వాంఖడే పిచ్ క్యూరేటర్‌కు రూ.35 వేల నగదు బహుమతి అందజేసింది...
ముంబయి: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించిన అనంతరం జట్టు యాజమాన్యం వాంఖడే పిచ్ క్యూరేటర్‌కు రూ.35 వేల నగదు బహుమతి అందజేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సొంతంగా అక్కడి క్యూరేటర్‌కు ఇదే విధంగా నగదు బహుమతి అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్ రెండో టెస్టులో పరుగుల పరంగా (372) అత్యంత భారీ విజయం అందుకున్న నేపథ్యంలో ఈ ప్రోత్సాహక బహుమతి అందజేసింది. సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభమైన గంటలోపే భారత జట్టు న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లు పడగొట్టి 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ 1 స్థానాన్ని భర్తీ చేసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ జట్టును వెనక్కి నెట్టింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా కివీస్ 121 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు వరుసగా ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం