Published : 04/12/2021 11:42 IST

IND vs NZ: మయాంక్‌ అగర్వాల్‌ భారీ ఇన్నింగ్స్‌.. 300కి చేరువలో టీమ్‌ఇండియా

ముంబయి: రెండో రోజు భోజన విరామ సమయానికి టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ (146; 306 బంతుల్లో 16x4, 4x6) భారీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. అతడికి తోడుగా అక్షర్‌ పటేల్‌ (32; 98 బంతుల్లో 4x4) చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఏడో వికెట్‌కు అభేద్యంగా 61 పరుగులు జోడించారు. అంతకుముందు ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే కివీస్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ టీమ్‌ఇండియాను దెబ్బతీశాడు. ఒకే ఓవర్‌లో సాహా(27), రవిచంద్రన్‌ అశ్విన్‌(0)లను పెవిలియన్‌ పంపి మొత్తం ఆరు వికెట్లు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌ కొనసాగిస్తున్న మయాంక్‌, అక్షర్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని