IND vs NZ: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విరాట్‌ కోహ్లీ

న్యూజిలాండ్‌తో మరికాసేపట్లో టీమ్‌ఇండియా రెండో టెస్టు ఆడనుంది. గతరెండు రోజులుగా ముంబయిలో వర్షం కురిసిన కారణంగా వాంఖడే మైదానం ఔట్‌ ఫీల్డ్‌ తడిగా మారింది...

Updated : 03 Dec 2021 11:53 IST

ముంబయి: న్యూజిలాండ్‌తో మరికాసేపట్లో టీమ్‌ఇండియా రెండో టెస్టు ఆడనుంది. గతరెండు రోజులుగా ముంబయిలో వర్షం కురిసిన కారణంగా వాంఖడే మైదానం ఔట్‌ ఫీల్డ్‌ తడిగా మారింది. దీంతో నేటి ఉదయం 9 గంటలకు వేయాల్సిన టాస్‌ను అంపైర్లు రెండున్నర గంటలు ఆలస్యం చేశారు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి పరిస్థితులు అదుపులోకి రావడంతో టాస్‌ వేశారు. దీంతో తొలిరోజు ఆటలో మొదటి సెషన్‌ తుడిచిపెట్టుకుపోయింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌కు కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ దూరంకావడతో టామ్‌ లాథమ్‌ సారథ్యం చేపట్టాడు.

భారత జట్టు: శుభ్‌మన్‌గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్

న్యూజిలాండ్‌ జట్టు: టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌), విల్‌ యంగ్‌, డారిల్‌ మిచెల్‌, రాస్‌ టేలర్‌, హెన్రీ నికోల్స్‌, టామ్‌ బ్లండెల్‌ (వికెట్‌ కీపర్‌), రచిన్‌ రవీంద్ర, కైల్‌ జేమీసన్‌, టిమ్‌సౌథీ, విలియమ్‌ సోమర్‌ విలే, అజాజ్‌ పటేల్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని