IND vs NZ: శ్రేయస్ అయ్యర్ స్టాండ్ ఔట్ ఆటగాడు: వీవీఎస్
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ను మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ‘స్టాండ్ ఔట్ ప్లేయర్’గా అభివర్ణించాడు...
ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ను మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ‘స్టాండ్ ఔట్ ప్లేయర్’గా అభివర్ణించాడు. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో అయ్యర్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు తొలి మ్యాచ్‌లోనే శతకం, అర్ధశతకం బాది.. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. తాజాగా అతడి ఆటతీరును మెచ్చుకుంటూ లక్ష్మణ్ ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడాడు.
‘ఈ సిరీస్‌లో శ్రేయస్ స్టాండ్ ఔట్ ప్లేయర్‌గా నిలిచాడు. తన తొలి టెస్టులోనే ఒత్తిడిని జయిస్తూ రాణించిన తీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడిన క్లిష్టపరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని బ్యాటింగ్ చేశాడు. తర్వాత శతకం సాధించాడు. ఇక టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చాడు. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఒత్తిడిలో శ్రేయస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అర్ధ శతకం సాధించాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు’ అని లక్ష్మణ్ ప్రశంసించాడు.
సిరాజ్.. టీమ్ఇండియాకు గొప్ప ఆస్తి
అలాగే, హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ టీమ్ఇండియాకు గొప్ప ఆస్తి అని లక్ష్మణ్ అన్నాడు. ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను సిరాజ్ కుప్పకూల్చిన విషయం తెలిసిందే. ‘రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశాడు. షార్ట్ పిచ్ బంతులతో కివీస్ టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చాడు. టెస్టు మ్యాచ్ బౌలర్‌గా గొప్ప పరిణతి సాధించాడు. టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక బౌలర్లు దూరమైన సమయంలో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మెరుగ్గా రాణించాడు. అతడి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. కీలక సమయాల్లో కచ్చితత్వంతో బంతులేస్తూ.. ప్రత్యర్థి జట్టును దెబ్బతీయగలడు. అందుకే, టీమ్ఇండియాకు అతడు గొప్ప ఆస్తి’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్ ఫినిషర్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో కుర్రాళ్లతో నిండిన టీమ్‌ఇండియా సవాలుకు సై అంది. విశాఖలో తొలి టీ20..! ఛేదన చివర్లో భారత్‌తడబడింది. -
జైపుర్‌కు పుణెరి షాక్
డిఫెండింగ్ ఛాంపియన్ జైపుర్ పింక్ పాంథర్స్‌కు పుణెరి పల్టాన్ షాకిచ్చింది. గత సీజన్ ఫైనల్లో జైపుర్ చేతిలో ఎదురైన పరాజయానికి ఇప్పుడు బదులు తీర్చుకుంది. -
మూడో కప్పుపై భారత్ గురి
రెండుసార్లు ఛాంపియన్ భారత్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌కు సిద్ధమైంది. మూడోసారి కప్పును సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న యువ భారత్ మంగళవారం ఆరంభమయ్యే టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. -
పిస్టల్ పేలి వేలు కోల్పోయిన షూటర్
ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ షూటింగ్ రేంజ్లో పిస్టల్ సిలిండర్ పేలి ఓ షూటర్ వేలు కోల్పోయాడు. -
326ఛేదించిన వెస్టిండీస్
షై హోప్ (109 నాటౌట్; 83 బంతుల్లో 4×4, 7×6) అజేయ శతకంతో సత్తాచాటడంతో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. -
రబాడ, బవుమాకు విశ్రాంతి
భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు కెప్టెన్ బవుమా, రబాడలకు దక్షిణాఫ్రికా విశ్రాంతినిచ్చింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కోసం వీరిద్దరికి విరామం ఇచ్చినట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా వెల్లడించింది. -
నొవాక్ ఎనిమిదోసారి
సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించాడు. -
చాహల్‌ను వెనక్కినెట్టిన బిష్ణోయ్!
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గానూ నిలిచాడు.