IND vs SA : అర్ధ శతకంతో రాణించిన రాహుల్..

తొలి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్ఇండియా.. రెండో సెషన్లో కాస్త మెరుగ్గానే రాణించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ (50: 133 బంతుల్లో 9×4) అర్ధ శతకంతో రాణించాడు.,,

Published : 03 Jan 2022 18:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తొలి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్ఇండియా.. రెండో సెషన్లో కాస్త మెరుగ్గానే రాణించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ (50: 133 బంతుల్లో 9×4) అర్ధ శతకంతో రాణించాడు. 25 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్‌లో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి.. 93 పరుగులు జోడించింది. దీంతో ఈ సెషన్‌ ముగిసే సరికి భారత్ 146/5 స్కోరుతో నిలిచింది. రెండో సెషన్‌ ప్రారంభలోనే ఎంగిడి వేసిన 32వ ఓవర్లో.. హనుమ విహారి వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విహారి ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బవుమా నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన విహారి (20).. రబాడ వేసిన 39వ ఓవర్లో వాండర్‌ డస్సెన్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. తొలి సెషన్‌లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ (26), ఛెతేశ్వర్‌ పుజారా (3), అజింక్య రహానె (0) ఔటైన విషయం తెలిసిందే. రిషభ్ పంత్‌ (13), రవిచంద్రన్‌ అశ్విన్‌ (24) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఒలివర్‌, మార్కో జాన్సన్‌ చెరో రెండు వికెట్లు, కగిసో రబాడ ఒక వికెట్ తీశాడు.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని