IND vs SA : ఆదుకున్న అశ్విన్‌.. తొలి ఇన్నింగ్స్‌ స్కోరెంతంటే.?

వాండరర్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 63.1 ఓవర్లలో టీమ్‌ఇండియా 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెన్ను నొప్పి కారణంగా

Published : 03 Jan 2022 19:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  వాండరర్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 63.1 ఓవర్లలో టీమ్‌ఇండియా 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో 9×4) అర్ధ శతకంతో రాణించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (46: 50 బంతుల్లో 6×4) అర్ధ శతకం చేజారినా.. కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ (26), హనుమ విహారి (20), రిషభ్‌ పంత్‌ (17), మహమ్మద్‌ షమి (9), ఛెతేశ్వర్‌ పుజారా (3), మహమ్మద్ సిరాజ్‌ (1) పరుగులు చేశారు. అజింక్య రహానె (0), శార్దూల్ ఠాకూర్ (0) డకౌట్‌ అయ్యారు. జస్ప్రీత్‌ బుమ్రా (14) నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్‌ నాలుగు,  ఒలివర్‌ మూడు, కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని