IND vs SA: ఆ రికార్డుకు చేరువలో ఇషాన్‌ కిషన్‌.. ఇంతకీ అది ఏంటంటే?

రాజ్‌కోట్‌ వేదికగా శుక్రవారం రాత్రి భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో ఉంది. దీంట్లో భారత్‌ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఒకవేళ టీమ్‌ఇండియా ఓటమిపాలైతే

Published : 17 Jun 2022 17:55 IST

ఇంటర్నెట్ డెస్క్: రాజ్‌కోట్‌ వేదికగా శుక్రవారం రాత్రి భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో ఉంది. దీంట్లో భారత్‌ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఒకవేళ టీమ్‌ఇండియా ఓటమిపాలైతే ఒక మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్ సౌతాఫ్రికా వశం అవుతుంది. ఈ కీలకమైన పోరులో మరోసారి సత్తా చాటాలని యువ భారత్ భావిస్తోంది. ఇదిలా ఉండగా, సూఫర్‌ ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌కు ఓ రికార్డు నెలకొల్పేందుకు నాలుగో టీ20 రూపంలో చక్కటి అవకాశం లభించింది. కిషన్‌ మరో 47 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 500కు పైగా పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.  గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్  13 ఇన్నింగ్స్‌ల్లో 500 పరుగులు పూర్తి చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇషాన్‌ కిషన్ ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్‌ల్లో 37.75 సగటుతో 453 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలున్నాయి. అందులో రెండు ఈ సిరీస్‌లో బాదినవే. తొలి టీ20లో ఇషాన్‌ (76; 48 బంతుల్లో) దంచికొట్టగా.. రెండో టీ20లో 34 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. వైజాగ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 54 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని