IND vs SA: వర్షం కారణంగా భారత్‌ - దక్షిణాఫ్రికా టెస్టుకు అంతరాయం.!

వాతావరణం అనుకూలించకపోవడంతో భారత్‌ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ఆలస్యంకానుంది. ఇప్పటికే మ్యాచ్‌ ప్రారంభమవ్వాల్సి...

Updated : 27 Dec 2021 15:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌‌: భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. సెంచూరియన్‌లో వర్షం కొనసాగుతుండటంతో రెండో రోజు ఆట మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. కాసేపటి క్రితం మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు వర్షం ఇంకా తగ్గక పోవడంతో.. నేరుగా లంచ్‌ బ్రేక్‌ తర్వాత మ్యాచ్‌ ప్రారంభించాలని నిర్ణయించారు. లంచ్‌ తర్వాత అంపైర్లు మరోసారి మైదానాన్ని పరిశీలించి ఆటపై నిర్ణయం తీసుకుంటారు. తొలి రోజు ఆటలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ (122*; 248 బంతుల్లో 17×4, 1×6) అజేయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.  మరో ఎండ్‌లో అజింక్య రహానె (40) ఉన్నాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని