IND vs SA: విశాఖలో అభిమానుల సందడి... కాసేపట్లో సఫారీలతో మూడో టీ20

విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కాసేపట్లో మూడో టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కొవిడ్‌ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ మ్యాచ్‌లు

Updated : 14 Jun 2022 17:26 IST

విశాఖపట్నం: విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కాసేపట్లో మూడో టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కొవిడ్‌ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించకపోవడంతో ఇవాళ జరిగే మూడో టీ20కి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మధ్యాహ్నం నుంచే మైదానం వద్ద బారులు తీరారు. మ్యాచ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. 

1,450 మంది పోలీసులతో బందోబస్తు

బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా పిచ్‌ను రూపొందించినట్టు ఏసీఏ ట్రెజరర్‌ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా 27వేల టికెట్లు అమ్మినట్టు చెప్పారు. అయితే, పూర్తి స్థాయిలో టికెట్లు అమ్మలేదని అభిమానుల నుంచి వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని గోపీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్షం వచ్చినా అరగంటలోనే మళ్లీ మ్యాచ్‌ మొదలయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా 1450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాయంత్రం 5గంటల నుంచి దారి మళ్లించనున్నారు. స్టేడియం ప్రతి గేటు వద్ద సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పాస్‌, టికెట్‌ చూసి లోపలికి పంపనున్నారు. వీవీఐపీ, వీఐపీలకు మొదటి గేటు నుంచి ప్రవేశం కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని