PinkBall Test: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 109 ఆలౌట్.. టీమ్‌ఇండియా లీడ్‌ 143

భారత్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు రెచ్చిపోవడంతో లంక బ్యాట్స్‌మెన్‌ 109 పరుగులకే ఆలౌటయ్యారు...

Updated : 13 Mar 2022 14:57 IST

ఆట ప్రారంభమైన అరగంటకే ఆలౌట్‌

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు రెచ్చిపోవడంతో లంక బ్యాట్స్‌మెన్‌ 109 పరుగులకే ఆలౌటయ్యారు. 86/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆదివారం రెండో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టును.. బుమ్రా, అశ్విన్‌ అరగంటలోనే మిగతా నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో శ్రీలంక మరో 23 పరుగులు మాత్రమే జోడించింది. అలాగే భారత్‌కు 143 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. లంక ఇన్నింగ్స్‌లో ఏంజిలో మాథ్యూస్‌ (43; 85 బంతుల్లో 3x4, 2x6), నిరోషన్‌ డిక్‌విల్లా (21; 38 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. బుమ్రా శనివారం మూడు వికెట్లు తీయగా ఆదివారం మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు మొత్తం ఐదు వికెట్లు తీశాడు. ఇక మిగతా బౌలర్లలో షమి, అశ్విన్‌ రెండేసి వికెట్లు తీయగా అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని