IND vs SL:గులాబీ బంతి టెస్టు.. రోహిత్‌ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు

టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డును అందుకోనున్నాడు. బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి శ్రీలంకతో టీమ్‌ఇండియా రెండో టెస్టు (డే/నైట్‌) ఆడనుంది. ఈ మ్యాచ్‌ను పింక్‌ బాల్‌(గులాబీ బంతి)ని

Published : 11 Mar 2022 19:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డును అందుకోనున్నాడు. బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి శ్రీలంకతో టీమ్‌ఇండియా రెండో టెస్టు (డే/నైట్‌) ఆడనుంది. ఈ మ్యాచ్‌ను పింక్‌ బాల్‌(గులాబీ బంతి)ని ఉపయోగించనున్నారు. కాగా, ఇది రోహిత్‌ శర్మకు 400వ అంతర్జాతీయ మ్యాచ్‌. ఈ ఘనత సాధించిన 35వ అంత‌ర్జాతీయ క్రికెటర్‌గా, 9వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. భారత క్రికెట్‌ దిగ్గజం, ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’ సచిన్ టెందూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. శ్రీలంక మాజీ ఆటగాళ్లు మహేల జయవర్ధనే (652), కుమార సంగక్కర (594), సనత్‌ జయసూర్య (586) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

భారత్‌ తరఫున సచిన్‌ తర్వాత  మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్  ధోనీ (538), రాహుల్ ద్రవిడ్ (509), విరాట్ కోహ్లీ (457), మహ్మద్ అజహారుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402) రోహిత్ కంటే ముందున్నారు. ఇక, హిట్‌మ్యాన్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2007లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు రోహిత్‌ శర్మ.. తన 15 ఏళ్ల కెరీర్‌లో 44 టెస్ట్ మ్యాచ్‌లు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని