IND vs SL: లంక ఆటగాడితో టీమ్‌ఇండియా ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తి.. వీడియో వైరల్
పింక్‌బాల్ టెస్టులో శ్రీలంక ఆటగాడు సురంగ లక్మల్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సోమవారం ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క పరుగు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు...
బెంగళూరు: పింక్‌బాల్ టెస్టులో శ్రీలంక ఆటగాడు సురంగ లక్మల్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సోమవారం ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క పరుగు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో లక్మల్ పెవిలియన్ బాట పట్టినప్పుడు బుమ్రాతో పాటు టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా దగ్గరికెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. బీసీసీఐ ఈ వీడియోను అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. మన ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తి చాటారని మెచ్చుకుంది. దీనిపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. బుమ్రా వికెట్ తీసినా సెలబ్రేట్ చేసుకోకుండా ప్రత్యర్థి దగ్గరికెళ్లి అభినందించడం బాగుందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పేసర్ మొత్తం 8 వికెట్లు తీశాడు. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా తొలిసారి భారత్‌లో ఈ ఘనత సాధించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలిస్తాం: నారా లోకేశ్
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు