Surya Kumar Yadav: సూర్య కుమార్‌ సిక్సర్ల వర్షం.. ఆ ఒక్క సిక్సర్‌కు పొలార్డ్‌ చప్పట్లు!

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ కళ్లుచెదిరే సిక్సర్లు కొట్టాడు. అయితే డ్రేక్స్‌ బౌలింగ్‌లో సూర్య ఆడిన ఓ షాట్‌ అయితే సంచలనం.

Updated : 21 Feb 2022 08:01 IST

కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్‌(65; 31 బంతుల్లో 1x4, 7x6) కళ్లుచెదిరే సిక్సర్లు కొట్టాడు. అయితే డ్రేక్స్‌ బౌలింగ్‌లో అతడు ఆడిన ఓ సిక్సర్‌ అయితే సంచలనమనే చెప్పొచ్చు. ఆఫ్‌ సైడ్‌ పడిన బంతిని చాలా ఆలస్యంగా అందుకుంటూ.. బ్యాట్‌ను వికెట్లకు దూరంగా పరిచినట్లు కొట్టిన ఆ షాట్‌కు బంతి వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఈ అద్భుతమైన షాట్‌కు ప్రత్యర్థి కెప్టెన్‌ పొలార్డ్‌ కూడా చప్పట్లతో అభినందించాడంటేనే ఆ సిక్సర్‌ ఎలా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు షెపర్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ నాలుగో బంతికి మరో నమ్మశక్యం కాని సిక్సర్‌ను కూడా బాదాడు. బంతిని ఏదో చటుక్కున పక్కకు లాగేసినట్లు కొట్టిన షాట్‌కు బంతి స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. టీమ్‌ఇండియా 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో వెంకటేశ్‌ అయ్యర్‌ (35; 19 బంతుల్లో 4x4, 2x6)తో కలిసి సూర్యకుమార్‌.. 37 బంతుల్లో 91  పరుగులు సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని