IND vs WI: వెంకటేశ్‌ అయ్యర్‌.. ఆల్‌రౌండర్, ఫినిషర్‌ దొరికినట్లే!

ధోని రిటైరయ్యాక ఇన్నింగ్స్‌కు మంచి ముగింపునిచ్చే, ఒత్తిడిలో నిలబడి లక్ష్య ఛేదనకు తోడ్పడే ఆటగాడి కోసం చూస్తోంది టీమ్‌ఇండియా...

Published : 21 Feb 2022 08:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోని రిటైరయ్యాక ఇన్నింగ్స్‌కు మంచి ముగింపునిచ్చే, ఒత్తిడిలో నిలబడి లక్ష్య ఛేదనకు తోడ్పడే ఆటగాడి కోసం చూస్తోంది టీమ్‌ఇండియా. హార్దిక్‌ పాండ్య సహా చాలామందిపై ఆశలు పెట్టుకుంది ఎవరూ ‘ఫినిషర్‌’ పాత్రను సమర్థంగా నిర్వర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ దిశగా ఆశలు రేకెత్తిస్తున్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ వెంకటేశ్‌ కెరీర్‌కు మలుపే. ఈ సిరీస్‌కు ముందు 2 వన్డేల్లో 24, 3 టీ20ల్లో 36 పరుగులే చేశాడతను. పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశం కూడా రాలేదు. అయితే ప్రస్తుత సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ అతను బ్యాటుతో అదరగొట్టాడు. 13 బంతుల్లో 24 నాటౌట్, 18 బంతుల్లో 33, 19 బంతుల్లో 35 నాటౌట్‌.. ఇవీ మూడు మ్యాచ్‌ల్లో అతడి స్కోర్లు. చివరి ఓవర్లలో అతను మెరుపులు మెరిపిస్తూ ఫినిషర్‌ పాత్రను సమర్థంగా నిర్వర్తించాడు. ఆఖరి టీ20లో దీపక్‌ చాహర్‌ గాయంతో బౌలింగ్‌ నుంచి తప్పుకుంటే బంతి అందుకుని 2.1 ఓవర్లు వేసిన వెంకీ.. 2 కీలక వికెట్లు పడగొట్టి ‘ఆల్‌రౌండర్‌’ అనిపించుకున్నాడు. వెంకటేశ్‌ ఇదే ఊపును కొనసాగిస్తే భారత్‌ కోరుకుంటున్న ఫినిషర్, ఆల్‌రౌండర్‌ దొరికినట్లే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని