IND vs WI : సిరీస్‌ నెగ్గాక మనోళ్ల జోరు చూశారా..?

టీమ్‌ఇండియా సూపర్‌ ఫామ్‌ కొనసాగుతోంది. ఈ నెలలోనే  ఇంగ్లాండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లను వారి స్వదేశంలోనే నెగ్గిన భారత్‌..తాజాగా  వెస్టిండీస్‌ గడ్డపై విజయ ఢంకా మోగించింది.

Updated : 25 Jul 2022 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సూపర్‌ ఫామ్‌ కొనసాగుతోంది. ఈ నెలలోనే ఇంగ్లాండ్‌ గడ్డపై టీ20, వన్డే సిరీస్‌లను నెగ్గిన భారత్‌..తాజాగా  వెస్టిండీస్‌లో విజయ ఢంకా మోగించింది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అయితే, అక్షర్‌ పటేల్‌ మెరుపు ఇన్నింగ్స్‌(35 బంతుల్లో 65 నాటౌట్‌)తో మరో రెండు బంతులు మిగిలిఉండగానే భారత్‌ 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో గెలుచుకొంది. ఈ విజయాన్ని టీమ్‌ఇండియా ఆటగాళ్లు  ఆస్వాదిస్తున్నారు. కెప్టెన్‌ ధావన్‌ తన ట్విటర్‌ ఖాతాలో టీమ్‌ఇండియా సంబరాలు చేసుకొన్న వీడియో పోస్టు చేశాడు. దీనికి ‘టాలెంట్‌ మ్యాచ్‌లను గెలిపిస్తుంది... కానీ, టీమ్‌ వర్క్‌, ఇంటెలిజెన్స్‌ ఛాంపియన్‌షిప్‌ను తీసుకొస్తుంది’ అనే క్యాప్షన్‌ జోడించాడు. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంట్లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు మంచి జోష్‌తో సంబరాలు చేసుకొంటూ కనిపించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని