IND vs WI: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో టీ20 ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు...

Updated : 02 Aug 2022 21:15 IST

(Photo: BCCI Twitter)

బస్సెటెర్రె: భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో టీ20 ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గత రాత్రి జరిగిన రెండో టీ20లో విండీస్‌ గెలవడంతో ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. ఈ పోరులో భారత్‌ విజయం సాధించి ఆధిక్యంలో నిలవాలని చూస్తోంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా, దినేశ్ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

వెస్టిండీస్‌ జట్టు: బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్‌ పూరన్‌ (కెప్టెన్‌), షిమ్రన్‌ హెట్మెయర్‌, డివాన్‌ థామస్‌, రోమన్‌ పావెల్‌, డొమినిక్‌ డ్రేక్స్‌, జేసన్‌ హోల్డర్‌, అకియల్‌ హోసీన్‌, అల్‌జారీ జోసెఫ్‌, ఒబెద్‌ మెకాయ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని