IND vs WI: రిషభ్‌ పంత్‌ సిక్సర్‌ వీడియో చూడండి.. అది మ్యాచ్‌కే హైలైట్!

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అవకాశం దొరికితే రెచ్చిపోయే ఆటగాడు. క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం ప్రత్యర్థులకు పెను సవాలే...

Updated : 27 Feb 2024 20:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అవకాశం దొరికితే రెచ్చిపోయే ఆటగాడు. క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం ప్రత్యర్థులకు పెను సవాలే. గతరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. మూడో వికెట్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ (8) పెవిలియన్‌ చేరాక పంత్‌ (52 నాటౌట్‌; 28 బంతుల్లో 7x4, 1x6) క్రీజులోకి వచ్చాడు. అతడు వచ్చీ రాగానే ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలుత కోహ్లీ (52; 41 బంతుల్లో 7x4, 1x6)తో నాలుగో వికెట్‌కు 34 పరుగులు జోడించగా.. తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌ (33; 18 బంతుల్లో 4x4, 1x6)తో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీమ్‌ఇండియా 186/5 పరుగుల భారీ స్కోర్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే జేసన్‌ హోల్డర్‌ వేసిన ఓ బంతిని పంత్‌ భారీ సిక్సర్‌గా మలిచాడు. అది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దాన్ని హెలికాఫ్టర్‌ షాట్‌లా ఆడటంతో చూసేందుకు అద్భుతంగా అనిపించింది. ఆ సమయంలో కామెంట్రీ బాక్స్‌లోని వ్యాఖ్యాతలు సైతం దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. షేడ్స్‌ ఆఫ్‌ మహేంద్రసింగ్‌ ధోనీ హెలికాఫ్టర్‌ షాట్‌ అంటూ ప్రశంసించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మీరూ ఒకసారి చూసి ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని