Published : 13 Aug 2022 15:33 IST

IND vs ZIM: జింబాబ్వే పయనమైన టీమ్‌ఇండియా ఆటగాళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్:  జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లు శనివారం ఉదయం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్‌ ధావన్‌, దీపక్‌ చహర్‌, ప్రసిద్ధ్ కృష్ణ,  మహమ్మద్‌ సిరాజ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శార్దుల్‌ ఠాకూర్‌,  కోచ్‌  వీవీఎస్‌ లక్ష్మణ్‌  విమానంలో బయల్దేరిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. హరారే వేదికగా ఈ నెల 18న మొదటి మ్యాచ్‌, 20న రెండో మ్యాచ్‌,  22న ఆఖరి మ్యాచ్‌ జరుగుతుంది. ఆసియాకప్‌ ఈ నెల 27 ప్రారంభం కానుండటంతో ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో లక్ష్మణ్‌  ఈ సిరీస్‌కు టీమ్‌ఇండియా కోచ్‌గా వ్యవహరించనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో ధావన్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను  కెప్టెన్‌గా ఎంపికచేసిన విషయం తెలిసిందే.

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శిఖర్ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్‌ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌.

జింబాబ్వే జట్టు: రెగిస్‌ చకబ్వా (కెప్టెన్‌), ర్యాన్ బర్ల్‌, సికందర్‌ రజా, తనకా చివాండా, బ్రాడ్లీ ఎవన్స్‌,ఇన్నోసింట్‌ కైయా, లుకే జాంగ్వే, క్లివ్‌ మదన్‌డే, వెస్లే మదివేర్‌, జాన్‌ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌, విక్టర్‌ నగర్వా, విక్టర్‌ నౌచీ, మిల్టన్‌ శుంబా, డొనాల్డో తిరిపానో.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని