Team India: ఆసియా కప్‌.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

జులై 19 నుంచి 28 వరకు మహిళల ఆసియా కప్‌ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 

Published : 06 Jul 2024 22:14 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్ తొమ్మిదో ఎడిషన్ జులై 19 నుంచి 28 వరకు జరగనుంది. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఈ ఆసియా కప్‌ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. నలుగురిని ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 

ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్, యూఏఈ ఉండగా.. గ్రూప్ బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌లో తలపడతాయి. అన్ని మ్యాచ్‌లు దంబుల్లాలో జరగనున్నాయి. జులై 19న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ ఢీకొననున్నాయి. టీమ్ఇండియా జులై 21న యూఏఈతో, 23న నేపాల్‌తో తలపడనుంది. 

భారత్‌ ఆసియా కప్‌ జట్టు: 

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్‌), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.

ట్రావెలింగ్ రిజర్వ్‌: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు