Team India: ఈ బౌలర్లతో భారత్‌ వరల్డ్ కప్‌ గెలవదు : పాక్‌ మాజీ స్పిన్నర్‌

ఈ ఏడాది ప్రపంచకప్‌ జరగనుండటంతో టీమ్‌ఇండియా (Team India) బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో ఉన్న లోపాలను పాక్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కానేరియా ఎత్తిచూపాడు.

Published : 25 Mar 2023 13:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని టీమ్‌ఇండియా 2-1 తేడాతో కోల్పోయింది. మొదటి వన్డేలో కష్టపడి గెలిచిన భారత్‌.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. టాపార్డర్‌ విఫలమవడంతోనే భారత్ సిరీస్‌ని చేజార్చుకుంది. దీంతో టీమ్‌ఇండియా (Team India)పై మన దేశ మాజీ ఆటగాళ్లతోపాటు ఇతర దేశాల మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)నకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసీస్‌పై సిరీస్‌ ఓటమి గురించి పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కానేరియా (Danish Kaneria) మాట్లాడాడు. బ్యాటింగ్ విభాగంలో లోపాలను ఎత్తిచూపుతూ ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ సిద్ధంగా లేదని చెప్పాడు.

‘ఫామ్‌లోకి రావడానికి విరాట్ కోహ్లీ చాలా సమయం తీసుకున్నాడు. కోహ్లీ ఫామ్‌ వల్ల జట్టులో ఎలాంటి మార్పు జరగలేదు. సూర్యకుమార్ యాదవ్‌ ఫామ్‌లో లేడు. సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం లేదు. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ ఆందోళన కలిగిస్తోంది. అతడు ప్రపంచకప్‌ వరకు అందుబాటులో ఉంటాడా లేదా? అనే విషయం తెలీదు. భారత్‌ ఏం చేస్తోంది. స్వదేశంలో వరల్డ్‌ కప్‌ ఆడనున్న టీమ్‌ఇండియా.. అందుకు ఇంకా సిద్ధం కాలేదు. ఇండియా పేలవమైన క్రికెట్ ఆడింది. బౌలింగ్‌ విభాగం బాగాలేదు. ప్రపంచకప్‌ సాధించాలనుకుంటే భారత్‌ మంచి బౌలింగ్‌ యూనిట్‌ని కలిగి ఉండాలి. ఈ బౌలర్లతో టీమ్‌ఇండియా వరల్డ్ కప్‌ని గెలవదు. బుమ్రా ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియదు. కాబట్టి, ఉమ్రాన్ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్, నటరాజన్‌లకు అవకాశాలు ఇవ్వాలి’ అని కానేరియా సూచించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని