Ban vs Ind: ‘టీమ్ఇండియా బౌలర్లది థర్డ్ క్లాస్ బౌలింగ్‌’.. పాక్‌ మాజీ క్రికెటర్‌ కామెంట్

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా టీమ్‌ఇండియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

Published : 09 Dec 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా టీమ్‌ఇండియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లను లక్ష్యంగా చేసుకునేందుకు భారత బౌలర్లెవరూ ప్రయత్నించలేదని, వారి ప్రదర్శనను ‘థర్డ్‌ క్లాస్‌’గా పేర్కొంటూ టీమ్‌ఇండియా ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు.  

‘భారత బౌలర్లు థర్డ్‌ క్లాస్‌ ప్రదర్శన చేసిన చోట బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇది దారుణం. భారత క్రికెట్ ఎటువైపు పయనిస్తుందో చూడాలి. బంగ్లాదేశ్‌లో భారత్‌ లాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ టీమ్‌ఇండియా బౌలర్లు విఫలమవుతున్నారు. భారత బౌలర్లు షార్ట్ పిచ్ బంతులను వేస్తున్నారు. ఒక్కరూ కూడా బ్యాటర్ల శరీరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. యార్కర్లను విసరలేదు. సిరాజ్ చాలా పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో దూకుడు ఉంది. కానీ, బౌలింగ్ కొంచెం దారితప్పింది’ అని కనేరియా పేర్కొన్నాడు. ఇక వన్డే సిరీస్‌ విషయానికొస్తే.. తొలి రెండు వన్డేల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలై సిరీస్‌ని చేజార్చుకుంది. డిసెంబరు 10న జరిగే మూడో వన్డేలోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవడం దృష్టిసారించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని