
Shreyas Iyer: శ్రేయస్ అరుదైన ఫీట్.. తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు
ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించి రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్ మరో అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించిన మొదటి భారతీయ క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయంగా పదో ఆటగాడు కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు. ఇంతకుముందు 1933-34 సీజన్‌లో దిలావర్ హుస్సేన్ (59, 57), 1970-71 సీజన్‌లో విండీస్ మీద సునిల్ గావస్కర్ (65,67*) డెబ్యూ టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధశతకాలు సాధించారు. అయితే వీరిద్దరి కన్నా శ్రేయస్ మెరుగ్గా రాణించాడు. కివీస్‌తో రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధిస్తాడని భావించినా సౌథీ బౌలింగ్‌లో బంతి గ్లౌజ్‌కు తాకి కీపర్ చేతిలో పడింది. దీంతో అర్ధశతకంతోనే వెనుదిరిగాడు.
శ్రేయస్ అయ్యర్ మరో రికార్డును కూడా సాధించాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు. అయ్యర్ కంటే ముందు వరుసలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఉన్నారు.
* శిఖర్ ధావన్.. 2012/13 సీజన్: ఆసీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 187, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు
* రోహిత్ శర్మ.. 2013/14 సీజన్: విండీస్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 177, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.