IND vs ENG: బ్యాటర్ల దూకుడు.. బౌలర్ల విజృంభణ.. భారత్ విజయం.. ఇవిగో వీడియోలు!

ఇంగ్లాండ్‌ను చిత్తు చేయడంలో టీమ్‌ఇండియా బ్యాటర్లతోపాటు బౌలర్ల కృషి ఉంది. ఇక ఫీల్డింగ్‌లోనూ మెరుపులతో అదరగొట్టేశారు.

Updated : 29 Jun 2024 12:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: షాకింగ్‌ డెలివరీలతో బుమ్రా అదరగొట్టాడు. అక్షర్, కుల్‌దీప్‌ తామేం తక్కువ కాదంటూ సత్తా చాటారు. తన బ్యాటింగ్‌ను అనుసరించండని కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతోనే చెప్పాడు. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు భారత జట్టు ఎదుట భలే ఛాన్స్ వచ్చింది. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి గెలిచింది. ఆ వీడియోల సమాహారం మీ కోసం.. 

చివరి వికెట్‌ దక్కిందిలా.. 

ఆర్చర్‌ను ఔట్‌ చేసిన బుమ్రా భారత్‌కు విజయం అందించాడు. అంపైర్‌ ఔట్ ఇచ్చినా.. ఇంగ్లాండ్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. సమీక్షలో భారత్‌కు అనుకూలంగా ఫలితం వచ్చింది. ఇంగ్లాండ్‌ ఓడి ఇంటిముఖం పట్టింది. 


సిక్స్‌ కొట్టి.. ఔటైన విరాట్

ప్రస్తుత ప్రపంచ కప్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో సిక్స్‌ కొట్టి ఊపులోకి వచ్చాడని అంతా భావించారు. కానీ, ఆ తర్వాత బంతికే బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. 


కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ అంటే ఇదీ..

రోహిత్ శర్మ అదరగొట్టేస్తున్నాడు. కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. ఆసీస్‌పై 92 పరుగులు చేసిన అతడు.. ఇంగ్లాండ్‌పైనా అర్ధశతకం (57) చేసి ప్రత్యర్థి ఎదుట మంచి లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు.


ఒకే ఓవర్‌లో రెండు సిక్స్‌లు.. రెండు వికెట్లు

క్రిస్‌ జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్య రెండు సిక్స్‌లు కొట్టాడు. మరో భారీ షాట్‌కు యత్నించి సామ్‌ కరన్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శివమ్‌ దూబె (0) గోల్డెన్‌ డక్‌ అయి పెవిలియన్‌కు చేరాడు.


ఇంగ్లాండ్ కెప్టెన్‌ను ఔట్ చేసిన అక్షర్ పటేల్

అప్పటివరకు దూకుడుగా ఆడిన జోస్ బట్లర్‌ను ఔట్ చేసిన అక్షర్‌ పటేల్ భారత్‌కు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. లెగ్‌సైడ్‌ వేసిన బంతిని ఆడబోయి వికెట్‌ కీపర్‌కు బట్లర్ క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. టీమ్‌ఇండియా పైచేయి సాధించింది.


బుమ్రా రాక్‌.. ఫిల్‌ సాల్ట్ షాక్

బుమ్రా బౌలింగ్‌ చేస్తుంటే.. ఎంతటి బ్యాటరైనా జాగ్రత్తగా ఆడాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వికెట్‌ సమర్పించడమే తరువాయి. ఇదే అనుభవం ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్‌ సాల్ట్‌కు ఎదురైంది. బుమ్రా వేసిన ఇన్‌స్వింగర్‌ను ఆడబోయి క్లీన్‌బౌల్డయ్యాడు.


రివర్స్‌ స్వీప్‌ వేస్తే.. డగౌట్‌కే

అంతకుముందు బంతినే రివర్స్‌ స్వీప్‌ చేసి బౌండరీగా మలిచాడు. మరోసారి అదే షాట్‌ను ఆడేందుకు ప్రయత్నించిన ఇంగ్లాండ్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ ఔటవక తప్పలేదు.  కుల్‌దీప్ బౌలింగ్‌లో ఇలా జరిగిపోయింది. స్టంప్స్‌నే లక్ష్యంగా చేసుకుని కుల్‌దీప్‌ బౌలింగ్‌ సాగింది.


భారత్‌ సూపర్ ఫీల్డింగ్‌.. ఇద్దరు రనౌట్

భారత జట్టు ఫీల్డర్లు అద్భుతం చేశారు. కీలకమైన రెండు వికెట్లను రనౌట్‌ రూపంలో పడగొట్టారు. తొలుత లివింగ్‌స్టోన్ ఈవిధంగా ఔట్ కాగా.. కాసేపటికే అదిల్ రషీద్ పెవిలియన్‌కు చేరాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని