Team India: చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. టీ20ల్లో తొలి జట్టుగా రికార్డు

జింబాబ్వేపై మూడో టీ20లో విక్టరీ ద్వారా పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు (Team India) అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది.

Published : 11 Jul 2024 00:21 IST

ఇంటర్నెట్ డెస్క్: యువ భారత్ అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా (Team India) 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితమైంది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. జింబాబ్వేపై మూడో టీ20లో విక్టరీ ద్వారా పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 230 టీ20లు ఆడిన టీమ్ఇండియా.. రికార్డు స్థాయిలో 150 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్థాన్‌ 142 విజయాలతో రెండో స్థానంలో ఉంది. 

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన టాప్-5 జట్లు 

  • భారత్ - విజయాలు 150 (ఆడిన మ్యాచ్‌లు 230)
  • పాకిస్థాన్‌ - విజయాలు 142 (ఆడిన మ్యాచ్‌లు 245)
  • న్యూజిలాండ్ - విజయాలు 111 (ఆడిన మ్యాచ్‌లు 220)
  • ఆస్ట్రేలియా -  విజయాలు 105 (ఆడిన మ్యాచ్‌లు 195)
  • దక్షిణాఫ్రికా - విజయాలు 104 (ఆడిన మ్యాచ్‌లు 185)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని