ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023.. అశ్విన్ సూచనను సమర్థించిన భారత బౌలింగ్ కోచ్
ప్రపంచకప్ మ్యాచ్‌లను కాస్త ముందుగానే ప్రారంభించాలని ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ సూచించిన విషయం తెలిసిందే. తాజాగా భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అశ్విన్ సూచనను సమర్థించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ మ్యాచ్‌లను కాస్త ముందుగానే ప్రారంభించాలని రవిచంద్రన్ అశ్విన్ చేసిన సూచనను భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సమర్థించాడు. అయితే ఈ విషయంలో ఐసీసీ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని అతడు స్పష్టం చేశాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నవంబరు లేదా డిసెంబరు నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 2023 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వబోతోందన్న విషయం తెలిసిందే. అప్పుడు భారత్‌కు శీతాకాలం ప్రారంభమవుతుంది. మంచు వల్ల రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. దీనిపై ఇటీవల అశ్విన్.. మంచు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రపంచకప్ మ్యాచ్‌ల సమయాన్ని ముందుకు జరిపితే బాగుంటుందని సూచించాడు. దీంతో అశ్విన్ సూచనకు పలువురు క్రికెటర్లు మద్ధతు పలుకుతున్నారు. తాజాగా టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ కూడా స్పందించాడు.
‘‘అశ్విన్ ఒక ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించాడు. కొన్ని వేదికల్లో మంచు ప్రభావం చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అది ఎప్పుడు, ఎక్కడ ఆడుతున్నారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. మంచు వల్ల బంతి స్పిన్ అవకపోతే బ్యాటింగ్ సులభమవుతుంది. ఈ విషయంపై ఐసీసీ దృష్టి పెట్టాలి’’ అని మాంబ్రే వెల్లడించాడు. ఇక శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ విభిన్నంగా ఉంటుందని మాంబ్రే పేర్కొన్నాడు. బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలరని అతడిని రీప్లేస్ చేయడం కష్టమని అతడు వ్యాఖ్యానించాడు.
‘‘మేము పిచ్‌లను గమనించి దాని ప్రకారమే ఎవరి కాంబినేషన్ బాగుంటుందో నిర్ణయిస్తాం. శార్దూల్‌ని అలానే ఎంపిక చేశాం. అతడి బౌలింగ్ ప్రత్యర్థి బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అతడు భారత్ తరఫున మంచి ప్రదర్శనలు చేశాడు. ఉమ్రాన్ వేగంతో వివిధ కోణాల్లో బంతులు విసురుతాడు. బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలర్. అతడిని రీప్లేస్ చేయడం కష్టం. అతడి నైపుణ్యాలను ప్రతిబింబించేవారు లేరు. వన్డే, టీ20 సిరీస్‌లలో అందరికీ అవకాశాలు ఇవ్వాలి. వారి ప్రదర్శనను, ఒత్తిడిని ఎలా తట్టుకుంటున్నారో పరీక్షించాలి. మేము ఎక్కువ ప్రయోగాలను చేయాలనుకోవట్లేదు. ప్రపంచకప్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వారిని పరీక్షిస్తున్నాం’’ అని మాంబ్రే పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyd ORR: డివైడర్‌ను దాటి ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి, 8 మందికి తీవ్రగాయాలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్
-
World News
Pervez Musharraf: ‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
-
General News
Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!