Updated : 07 Jul 2022 11:44 IST

Rohit Sharma : ఉమ్రాన్‌కు అవకాశాలపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ ఏమన్నాడంటే?

ఇంటర్నెట్ డెస్క్‌: భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ తరఫున రాణించిన ఉమ్రాన్‌ మాలిక్ జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీ20 జట్టులోకి తీసుకున్నప్పటికీ.. తుది 11 మందిలో స్థానం దక్కలేదు. అయితే ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన ఉమ్రాన్‌ కేవలం ఒక్క వికెట్‌ (1/42) మాత్రమే తీశాడు. భారీగానే పరుగులు సమర్పించుకున్నప్పటికీ అతని పేస్‌ బాగుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజాగా ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. భారత సారథి రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకుని టీ20 సిరీస్‌కు సిద్ధమైపోయాడు. నేటి రాత్రి 10 గంటలకు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంపిక సహా ఇతర విషయాలపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.

‘‘కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా. ప్రాక్టీస్‌ కూడా ప్రారంభించాను. కరోనా టెస్టులోనూ నెగిటివ్‌గా తేలింది. అందుకే టీ20ల్లో ఆడాలని నిర్ణయించుకొన్నా. ముఖ్యమైన గేమ్‌లు ఆడకుండా ఖాళీగా కూర్చుంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఫాస్టెస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ శైలిని పరిశీలిస్తున్నాం. జట్టుకు ఏం కావాలో ఉమ్రాన్‌కు బాగా తెలుసు. వచ్చే ప్రపంచకప్‌ కోసం జట్టును తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తాం. భారత టీ20 లీగ్‌లో ఉమ్రాన్‌ మాలిక్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడికి అవకాశాలు ఇవ్వడంపై ఎటువంటి సందేహం లేదు. అయితే, ఫ్రాంచైజీ క్రికెట్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉంటుంది’’ అని రోహిత్ శర్మ వివరించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్‌ఇండియా ఓటమిపై స్పందిస్తూ.. అన్నింటికీ సమయమే సమాధానం చెబుతుందని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts