IND vs SA : టీమ్‌ఇండియా మ్యాచ్‌ గురించి మర్చిపోయింది..అందుకే ఇలా?: డీన్‌ ఎల్గర్‌

సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్‌ ఎక్కువగా డీఆర్ఎస్ గురించే ఆలోచిస్తూ.. మ్యాచ్ గురించి మర్చిపోయిందని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ అన్నాడు. అది మేం మరింత స్వేచ్చగా ఆడేందుకు...

Published : 16 Jan 2022 03:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్‌ ఎక్కువగా డీఆర్ఎస్ గురించే ఆలోచిస్తూ.. మ్యాచ్ గురించి మర్చిపోయిందని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ అన్నాడు. అది మేం మరింత స్వేచ్చగా ఆడేందుకు సహయపడిందని పేర్కొన్నాడు.

‘మూడో టెస్టులో టీమ్‌ఇండియా కొంచెం ఒత్తిడికి గురైంది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో వెంటనే వికెట్లు దక్కకపోవడం అందుకు ప్రధాన కారణం. అదే సమయంలో రివ్యూలో నేను నాటౌట్ అని తేలడంతో భారత ఆటగాళ్లు మరింత అసహనానికి గురయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఆవేశంగా కనిపించాడు. డీఆర్‌ఎస్ గురించి ఆలోచిస్తూ ఆటపై సరిగా దృష్టి పెట్టలేకపోయారు. ఆ అవకాశాన్ని మేం సద్వినియోగం చేసుకున్నాం. నిలకడగా రాణిస్తూ విజయ తీరాలకు చేరుకోగలిగాం. భారత్‌ లాంటి బలమైన జట్టుపై విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది’ అని డీన్‌ ఎల్గర్‌ పేర్కొన్నాడు.

చివరి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 21వ ఓవర్లో డీన్‌ ఎల్గర్‌ ఎల్బీడబ్ల్యూ కోసం జట్టు అప్పీల్‌ చేసింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఎరాస్మస్‌ కూడా ఔటిచ్చాడు. అయితే, అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎల్గర్‌ రివ్యూకి వెళ్లాడు. సమీక్షలో బంతి గమనాన్ని బట్టి ఔట్ అని భావించిన ఎల్గర్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే, బంతి వికెట్లపై నుంచి వెళ్తున్నట్లు తేలడంతో మళ్లీ బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఈ నిర్ణయంపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. కీలక వికెట్ విషయంలో ఇలా జరగడంతో వికెట్ల దగ్గరకు వెళ్లి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని