IND w Vs AUS w: టీమ్‌ఇండియా ఓడిపోవడానికి టర్నింగ్‌ పాయింట్‌ అదే..: వీవీఎస్‌

మహిళల ప్రపంచకప్‌లో (Womens T20 World Cup 2023) భారత్‌ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఆసీస్‌ చేతిలో కేవలం ఐదు పరుగుల తేడాతోనే ఓటమిపాలైంది. 

Published : 24 Feb 2023 17:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో (Womens T20 World Cup 2023) భారత్‌ ఓడిపోయింది. ఆసీస్‌ చేతిలో కేవలం ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమ్ఇండియా (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్‌ కౌర్ (52) అర్ధశతకం సాధించినా.. జెమీమా రోడ్రిగ్స్‌ (43) కీలక ఇన్నింగ్స్‌ ఆడినా విజయం సొంతం కాలేదు. గెలుపు కోసం చివరి వరకు పోరాడినా.. ఓ చిన్న తప్పిదం మ్యాచ్‌ గతినే మార్చేసింది. అదే మ్యాచ్‌ను భారత్‌ నుంచి ఆసీస్‌ వైపు తిప్పేసిందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman) అభిప్రాయపడ్డాడు.  

‘‘హర్మన్‌ప్రీత్‌ కౌర్ (Harmanpreet Kaur) , జెమీమా రోడ్రిగ్స్‌ (JemimahRodrigues) క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌దే విజయమని అంతా భావించాం. అయితే, మనకు అదృష్టం కలిసిరాలేదు. ఆసీస్‌ ఒక్కసారిగా పుంజుకోవడంతో మ్యాచ్‌ అటువైపు తిరిగింది. ఆఖర్లో భారత్‌ త్వరగా వికెట్లను కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ రనౌట్‌ కావడం టర్నింగ్‌ పాయింట్‌. ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలం కావడంతో టీమ్‌ఇండియా తీవ్ర నిరుత్సాహానికి గురైంది’’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. 

ఆసీస్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించకపోయినా.. హర్మన్‌, రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే, అప్పటికే క్రీజ్‌లో కుదురుకుని హాఫ్ సెంచరీ సాధించిన హర్మన్‌.. మరో 33  బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన తరుణంలో హర్మన్‌ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరింది. ఇలా 2019లో కివీస్‌పై భారత దిగ్గజం ఎంఎస్ ధోనీ రనౌట్‌తో నెటిజన్లు పోల్చారు. కానీ, తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆసీస్‌ బౌలింగ్‌ను ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. చివరి 167/8 స్కోరుకే పరిమితం కావడంతో ఆసీస్‌ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు