IND vs SL: ‘ఫార్మాట్‌ ఏదైనా.. భారత్‌దే ఆధిపత్యం’.. ప్రముఖ ఆటగాళ్ల స్పందనలివీ..

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంపై సరత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో గెలుపొందింది. బెంగళూరు వేదికగా జరిగిన పింక్‌బాల్..

Published : 15 Mar 2022 01:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో గెలుపొందింది. బెంగళూరు వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులోనూ భారత్‌ ఆధిపత్యం కొనసాగించింది. ఈ మ్యాచులో 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ 2-0 తేడాతో భారత్‌ సొంతమైంది. టీమ్‌ఇండియా సాధించిన ఈ విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌..‘పింక్‌, వైట్, రెడ్ బాల్‌ క్రికెట్లో భారత్‌ గొప్ప ప్రదర్శన చేసింది’ అని ట్వీట్ చేయగా.. ‘శ్రేయస్‌ అయ్యర్‌ రెండు ఇన్నింగ్సుల్లోనూ చూడచక్కని షాట్లు ఆడాడు. రిషభ్‌ పంత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన క్లాస్ బౌలింగ్‌ కట్టిపడేశాడు. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు’ అని వీవీఎస్ లక్ష్మణ్‌ అన్నాడు. వీరితో పాటు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ తదితరులు టీమ్‌ఇండియాపై ప్రశంసలు కురిపించారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని