చివరి రెండు టెస్టులకు టీమిండియా ఎంపిక

అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు 17 మంది ఆటగాళ్లతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శార్దూల్‌ ఠాకూర్ మినహా తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన ఆటగాళ్లందరూ...

Published : 17 Feb 2021 17:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు 17 మంది ఆటగాళ్లతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శార్దూల్‌ ఠాకూర్ మినహా తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన ఆటగాళ్లందరూ ఆఖరి రెండు టెస్టులకు ఎంపికయ్యారు. శార్దూల్‌ను విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు అనుమతించారు. అయితే స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టుతో ఉండి తొలి టెస్టులో చోటు సంపాదించుకున్న స్పిన్నర్‌ నదీమ్‌ను ఎంపికచేయలేదు.

మరోవైపు గాయం నుంచి కోలుకున్న ఉమేశ్‌ యాదవ్‌ గురించి మూడో టెస్టుకు ముందుగా నిర్ణయం తీసుకోనున్నారు. మరో పేసర్ మహ్మద్ షమిని జట్టులోకి తీసుకోలేదు. గాయం నుంచి అతడు కోలుకున్నప్పటికీ టెస్టులకు పూర్తిఫిట్‌నెస్‌ సాధించకపోవడమే దానికి కారణమని తెలుస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి మొతెరా(అహ్మదాబాద్‌) వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ట్టు వివరాలు

విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

స్టాండ్‌బై ప్లేయర్లు: కేఎస్ భరత్, రాహుల్ చాహర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని