శ్రీలంకతో ఇండియా లెజెండ్స్‌ అమీతుమీ

మాజీ దిగ్గజాలతో జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ సిరీస్ ఎట్టకేలకు చివరి అంకానికి చేరింది. ఆదివారం సాయంత్రం రాయ్‌పూర్‌లోని షాహీద్‌వీర్‌ నారాయణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా...

Updated : 20 Mar 2021 11:28 IST

రేపే రోడ్‌ సేఫ్టీ సిరీస్‌ ఫైనల్‌..

(Photo: Sachin Tendulkar Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ దిగ్గజాలతో జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ సిరీస్ ఎట్టకేలకు చివరి అంకానికి చేరింది. ఆదివారం సాయంత్రం రాయ్‌పూర్‌లోని షాహీద్‌వీర్‌ నారాయణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా లెజెండ్స్‌, శ్రీలంక లెజెండ్స్‌ తలపడనున్నారు. గతరాత్రి దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ను చిత్తు చేయడంతో లంక లెజెండ్స్‌ ఫైనల్‌ చేరింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం భారత్‌తో తలపడనున్నారు.

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సిరీస్‌ నిజానికి గతేడాది మార్చిలో ప్రారంభమైంది. మొత్తం ఏడు జట్లు పోటీపడగా, చివరికి భారత్‌, లంక జట్లు తుది పోరుకు అర్హత సాధించాయి. 2020 మార్చి 7న ఇండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి పోరు జరిగింది. తర్వాత దేశంలో కరోనా కేసుల ప్రభావంతో నాలుగు మ్యాచ్‌ల తర్వాత సిరీస్ వాయిదా పడింది. మళ్లీ ఈ ఏడాది మార్చి 11 నుంచి మిగతా మ్యాచ్‌లను నిర్వహించగా భారత్‌ వరుస విజయాలతో దూసుకెళ్లింది. సచిన్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌లు మునుపటి రోజుల్ని గుర్తుకు తెస్తూ భారత్‌ను ముందుండి నడిపిస్తున్నారు.

ఇక గతరాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణఫ్రికాను నువాన్‌ కులశేఖర 5/25 కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ వాన్‌వింక్‌(53; 47 బంతుల్లో 8x4) ఒక్కడే రాణించాడు. ఆపై లంక బ్యాట్స్‌మెన్‌ ఉపుల్‌ తరంగా(39*; 44 బంతుల్లో 5x4), చింతక జయసింగే(47*; 25 బంతుల్లో 8x4, 1x6) రాణించడంతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే రేపు భారత్‌, శ్రీలంక జట్లు తుదిపోరులో తలపడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని