IND vs NZ: లేథమ్‌ సెంచరీ చేస్తే.. టీమ్‌ఇండియా డీఆర్‌ఎస్‌ రద్దు చేయమంటుందేమో! : జిమ్మీ నీషమ్‌

కాన్పూర్‌ వేదికగా జరుగుతోన్న మొదటి టెస్టు రెండో రోజు కివీస్‌ ఓపెనర్ టామ్‌ లేథమ్ (50: 165 బంతుల్లో 4x4) మూడు సార్లు డీఆర్ఎస్ ఉపయోగించుకుని బతికిపోయిన విషయం తెలిసిందే. ఈ..

Updated : 27 Nov 2021 10:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కాన్పూర్‌ వేదికగా జరుగుతోన్న మొదటి టెస్టు రెండో రోజు కివీస్‌ ఓపెనర్ టామ్‌ లేథమ్ (50: 165 బంతుల్లో 4x4) మూడు సార్లు డీఆర్ఎస్ ఉపయోగించుకుని బతికిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కివీస్‌ బౌలర్‌ జిమ్మీ నీషమ్‌ సరదాగా స్పందించాడు. ‘ఈ టెస్టులో లేథమ్‌ శతకం నమోదు చేస్తే.. టీమ్‌ ఇండియా డీఆర్ఎస్‌ విధానాన్ని రద్దు చేయమంటుందేమో.!’ అని నీషమ్‌ ట్వీట్ చేశాడు. 

రెండో రోజు టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ త్వరగానే ముగిసింది. 258/4 ఓవర్‌ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన భారత్‌ 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆట ముగిసే సరికి 129/0 స్కోరుతో నిలిచింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఇషాంత్‌ శర్మ వేసిన మూడో ఓవర్లోనే లేథమ్‌ను అంపైర్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే, డీఆర్‌ఎస్‌లో బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుందని తేలింది. తర్వాత 15వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లోనూ లేథమ్‌ మరోసారి వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ రివ్యూకి వెళ్లి బతికిపోయాడు. 56వ ఓవర్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ బంతికి లేథమ్‌ క్యాచ్‌ ఔట్‌ అయినట్లు భావించి అంపైర్‌ వేలెత్తాడు. సమీక్షలో బంతి ప్యాడ్‌ను తాకి వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడిందని తేలింది. దీంతో మూడోసారి కూడా లేథమ్‌ బతికిపోయాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్‌ మొయిన్ అలీ తర్వాత సమీక్షను ఉపయోగించుకుని మూడు సార్లు బతికిపోయిన రెండో ఆటగాడిగా లేథమ్‌ రికార్డు సృష్టించాడు.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని