Team India: ఫిఫా అండర్‌ -17 వరల్డ్‌ కప్‌.. భారత మహిళల జట్టు ప్రకటన

ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌ కోసం 21 మందితో కూడిన టీమ్‌ఇండియా జట్టును భారత ఫుట్‌బాల్ సంఘం ప్రకటించింది. అక్టోబర్‌ 11 నుంచి భువనేశ్వర్‌ వేదికగా ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది.

Published : 06 Oct 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌ కోసం 21 మందితో కూడిన టీమ్‌ఇండియా జట్టును భారత ఫుట్‌బాల్ సంఘం ప్రకటించింది. అక్టోబర్‌ 11 నుంచి భువనేశ్వర్‌ వేదికగా ఫిఫా అండర్‌-17  ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. భువనేశ్వర్‌, గోవా, నవీ ముంబయి మైదానాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో భారత్ తలపడనుంది. యూఎస్‌ఏ, మొరాకో, బ్రెజిల్‌ జట్లతో కూడిన గ్రూప్‌లో టీమ్‌ఇండియా ఆడనుంది. భారత్ కోచ్‌ థామస్‌ డెన్నెర్‌బే మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు భారత్‌ ప్రపంచకప్‌ బరిలోకి దిగలేదు. అందుకే ప్రతి ప్లేయర్‌కు ఇది కొత్త. అలాగే క్లబ్‌ గేమ్‌లతో పోలిస్తే ఇలాంటి టోర్నీల్లో ఆట వైవిధ్యంగా ఉంటుంది’’ అని వెల్లడించాడు. కెప్టెన్‌గా అస్తమ్‌ ఓరాన్‌ వ్యవహరించనుంది.

భారత్‌ జట్టు ఇదే: 

గోల్‌ కీపర్స్‌: మనాలిషా దేవి, మెలోడీ చాను కీషమ్, అంజలీ ముందా

డిఫెండర్స్‌: అస్తమ్‌ ఓరాన్, కాజల్, నకేతా, పుర్నిమా కుమారి, వర్షిక, షిల్కే దేవి హేమమ్‌

మిడ్‌ ఫీల్డర్స్‌: బబినా దేవి లిషమ్, నీతూ లిండా, శైల్జా, శుభాంగి సింగ్‌

ఫార్వర్డ్స్‌: అనితా కుమారి, లింగా కోమ్‌ సెర్టో, నేహ, రెజియా దేవి, షెలియా దేవి, కాజోల్ హుబర్ట్‌ డిసౌజా, లావన్య ఉపాధ్యాయ్‌, సుధా అంకిత టిర్కే


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని