Mohammed Shami: షమికి కరోనా నెగిటివ్‌.. సోషల్‌ మీడియాలో ప్రకటన

భారత పేసర్ మహ్మద్‌ షమికి కరోనా నెగిటివ్‌గా తేలింది. కాగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షమి వెల్లడించాడు.........

Published : 28 Sep 2022 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత పేసర్ మహ్మద్‌ షమికి కరోనా నెగిటివ్‌గా తేలింది. కాగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షమి వెల్లడించాడు. నెగిటివ్‌ రిపోర్టును బుధవారం ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. అయితే, కరోనా నుంచి పూర్తిగా కోలుకోలేదంటూ సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్‌కు బీసీసీఐ అతడిని పక్కనబెట్టి ఉమేశ్‌కు చోటుకల్పించిన మరుసటి రోజే ఈ రిపోర్టు రావడం గమనార్హం.

సెప్టెంబర్‌ 17న ఈ సీనియర్‌ పేసర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు బీసీసీఐ అతడిని పక్కనబెట్టింది. పూర్తిగాకోలుకోకపోవడంతో బుధవారం నుంచి సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్‌ నుంచి కూడా షమిని తప్పించింది. ‘కరోనా నుంచి పూర్తిగా బయటపడలేదు’ అని బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో ఉమేశ్‌ను జట్టులోకి తీసుకుంది. గత జులై నుంచి షమి ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేదు. జరగబోయే టీ20 ప్రపంచకప్‌ ప్రధాన స్వ్కాడ్‌లోనూ షమిని బీసీసీఐ ఎంపికచేయలేదు. స్టాండ్‌బై ప్లేయర్‌గానే తీసుకుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts