Olympics: ఒలింపిక్స్‌-2036 పోటీలను నిర్వహించేందుకు భారత్‌ సంసిద్ధం: అనురాగ్ ఠాకూర్‌

ఒలింపిక్స్‌ (olympics)ను మించిన క్రీడా సంబరం మరొకటి ఉండదు. ఛాంపియన్లు పాల్గొనే ఒలింపిక్స్‌లో పతకం నెగ్గితే అదొక అద్భుతమే. అయితే ఇలాంటి క్రీడోత్సవాలను నిర్వహించాలంటే లక్షల కోట్లతో కూడిన వ్యవహారం. అలాంటి అవకాశం వస్తే భారత్‌ (india) ఏమాత్రం వదులుకోదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 

Published : 29 Dec 2022 01:18 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నాలుగు సంవత్సరాలకు జరిగే ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించడం తేలికైన విషయం కాదు. మైదానాలు, ఆటగాళ్ల మౌలిక సదుపాయాలకు లక్షల కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. అయితే 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు సంబంధించిన బిడ్‌లను దాఖలు చేసేందుకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) సిద్ధమవుతోంది. దీని కోసం సెప్టెంబర్ 2023లో జరిగే అంతర్జాతీయయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) ఎదుట ప్రెజెంటేషన్‌ ఇవ్వడానికి రోడ్‌మ్యాప్‌ను తయారు చేస్తున్నట్లు ఐవోఏ వెల్లడించింది. ఐవోఏ నిర్ణయానికి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మద్దతుగా నిలిచారు. 

‘‘ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ) వేయాలనే బిడ్‌కు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.  ఉంటుంది. ‘అతిథ్య నగరం’గా ఉండే అహ్మదాబాద్‌లో  ప్రపంచస్థాయి క్రీడా వసతులు అందుబాటులో ఉన్నాయి. 1982లో ఆసియా గేమ్స్, 2010లో కామన్వెల్త్‌ గేమ్స్‌ను నిర్వహించిన అనుభవం భారత్‌కు ఉంది. అతిపెద్ద క్రీడోత్సవం ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం ఎదురు చూస్తోంది.2036 స్లాట్‌ కోసం బిడ్‌ దాఖలు చేసేందుకు భారత ఒలింపిక్‌ సంఘం సిద్ధమై ఉంటుందని అనుకొంటున్నా’’

‘‘ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం భారత్‌ సిద్ధంగా ఉంటుంది. వద్దనడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. క్రీడలను ప్రమోట్‌ చేయడంలో భారత్‌ చాలా కృషి చేస్తుంది. అందుకే ఒలింపిక్స్‌తో పాటు ఎలాంటి క్రీడోత్సవాలనైనా సమర్థంగా నిర్వహించగలం. తయారీ రంగం నుంచి సేవల వరకు అన్నింట్లోనూ భారత్‌ ఉన్నప్పుడు.. క్రీడల్లో ఎందుకు ఉండకూడదు? అందుకే 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం బిడ్‌ దాఖలు చేసేందుకు భారత్‌ తీవ్రంగా కృషి చేస్తుంది’’ అని వెల్లడించారు. 2024 ఒలింపిక్స్‌ను పారిస్‌, 2028 ఒలింపిక్స్‌ను లాస్‌ ఏంజెలెస్, 2032 ఒలింపిక్స్‌ను బ్రిస్బేన్‌ వేదికగా నిర్వహించేందుకు ఇప్పటికే ఐవోసీ ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని