SA vs IND: నవంబర్‌లో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

దక్షిణాఫ్రికాతో ఈ ఏడాది నవంబర్‌లో టీమ్‌ఇండియా నాలుగు టీ20లు ఆడనుంది.

Published : 21 Jun 2024 15:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన చేపట్టనుంది. 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇందుకోసం దక్షిణాఫ్రికా బోర్డు షెడ్యూల్‌ ప్రకటించింది. నవంబర్‌ 8 నుంచి 15 వరకు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. 2024-25 సీజన్‌కు స్వదేశంలో టీమ్‌ఇండియా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించిన అనంతరం.. దక్షిణాఫ్రికా తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.

షెడ్యూల్‌ ఇదే..

  • తొలి టీ20: నవంబర్‌ 8, వేదిక డర్బన్‌
  • రెండో టీ20: నవంబర్‌ 10, వేదిక గబేహా
  • మూడో టీ20: నవంబర్‌ 13, వేదిక సెంచూరియన్‌
  • నాలుగో టీ20: నవంబర్‌ 15, జొహన్నెస్‌బర్గ్‌

గత ఏడాది భారత్‌.. దక్షిణాఫ్రికా పర్యటన చేపట్టింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. ఇందులో వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో గెలవగా.. టెస్టు, టీ20 సిరీస్‌ల్లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు