
U-19 World Cup: ప్రపంచకప్‌లో కరోనా కలకలం.. ఆరుగురు భారత ఆటగాళ్లకు పాజిటివ్
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో కరోనా కలకలం రేగింది. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ సహా మరో నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు సమాచారం. ఆరాధ్య యాదవ్, వాసు వత్స్, మనవ్ పరఖ్, సిద్ధార్థ్ యాదవ్‌లకు కూడా పాజిటివ్‌గా తేలినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. అయితే వీరిని ప్రస్తుతం ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘మంగళవారం నలుగురు భారత ఆటగాళ్లకు కరోనా సోకినట్లు తేలింది. వారిని ఐసోలేషన్‌లో ఉంచాం. ఈ రోజు ఉదయం కెప్టెన్, వైస్ కెప్టెన్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
అండర్-19 ప్రపంచకప్‌లో గ్రూప్-బిలో ఉన్న భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగానే కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా మరో నలుగురు ఆటగాళ్లు అందుబాటులో లేనట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో నిషాంత్ సింధు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా కీలక ఆటగాళ్లు లేకపోయినా.. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువంశి (79), హర్నూర్ సింగ్ (88) వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత వచ్చిన రాజ్ బజ్వా (64 బంతుల్లో 42) ఆచితూచి ఆడగా.. చివర్లో కెప్టెన్ నిశాంత్ సింధు (34 బంతుల్లో 36), రాజ్వర్ధన్ ( 17 బంతుల్లో 39) రెచ్చిపోయారు. ముఖ్యంగా రాజ్వర్ధన్ ఐదు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.