ప్చ్‌..!  టీమ్‌ఇండియా ర్యాంకు 4

ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ర్యాంకు మరింత దిగజారింది. సునాయాసంగా ఫైనల్‌కు చేరుకొనే స్థాయి నుంచి కష్టపడితే తప్ప చేరుకోలేని పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కోహ్లీసేన ర్యాంకు నాలుగుకు చేరుకుంది....

Published : 09 Feb 2021 16:23 IST

2-1 లేదా 3-1తో గెలవకపోతే ఫైనల్‌ కష్టం

దుబాయ్‌: ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ర్యాంకు మరింత దిగజారింది. సునాయాసంగా ఫైనల్‌కు చేరుకొనే స్థాయి నుంచి కష్టపడితే తప్ప చేరుకోలేని పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కోహ్లీసేన ర్యాంకు నాలుగుకు చేరుకుంది. ఛాంపియన్‌షిప్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్టే ఫైనల్‌ ఆడే సంగతి తెలిసిందే.

చెపాక్‌ వేదికగా జరిగిన టెస్టులో భారత్‌ 227 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 420 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 192 పరుగులకే కుప్పకూలింది. విరాట్‌ కోహ్లీ 104 బంతుల్లో 72 పరుగులు చేయడమే ఊరట. తొలి రెండు రోజులు అత్యంత ఫ్లాట్‌గా ఉన్న పిచ్‌ ఆఖరి రోజు విపరీతంగా టర్న్‌ అయింది. దీనిని ఇంగ్లాండ్‌ అనుకూలంగా మలుచుకుంది.

న్యూజిలాండ్‌ జట్టు 70శాతం విజయాల రేటుతో ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. మరో స్థానం కోసం భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పోటీ పడుతున్నాయి. ప్రస్తుత సిరీసులో 3-1, 3-0 లేదా 4-0తో గెలిస్తే ఇంగ్లాండ్‌ ఫైనల్‌ చేరుకుంటుంది. ఆసీస్‌పై విజయంతో అగ్రస్థానానికి చేరుకున్న టీమ్‌ఇండియా ఇప్పుడు 68.3 శాతం విజయాలతో నాలుగో స్థానానికి వచ్చింది. కోహ్లీసేన ఫైనల్‌ చేరుకోవాలంటే మాత్రం 2-1 లేదా 3-1తో సిరీస్‌ను గెలవాల్సిందే.

ఒకవేళ భారత్ ‌× ఇంగ్లాండ్‌ సిరీసు డ్రా అయితే లేదా ఇంగ్లాండ్‌ 1-0, 2-1, 2-0తో గెలిస్తే ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుందని ఐసీసీ తెలిపింది. ఇక దక్షిణాఫ్రికాపై 2-0తో గెలిచిన పాకిస్థాన్‌ 43.3% విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. సఫారీ జట్టు 30 శాతంతో ఆరో స్థానానికి పడిపోయింది. విండీస్‌ 23.8 శాతంతో ఏడు, బంగ్లాదేశ్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

ఇవీ చదవండి
చెన్నె టెస్టు: భారత్‌ ఘోర ఓటమి.. 
అందుకే సుదీర్ఘంగా బౌలింగ్‌ చేస్తా..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని