Teamindia: బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ను ఢీకొట్టే భారత జట్టు ఇదే.. ప్రకటించిన బీసీసీఐ!
బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20, వన్డే, టెస్టు మ్యాచులకు సంబంధించి టీమ్‌ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.
దిల్లీ: బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20, వన్డే, టెస్టు మ్యాచులకు సంబంధించి టీమ్‌ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ఈ వివరాలను వెల్లడించాడు. బంగ్లాతో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. న్యూజిలాండ్‌తో నవంబర్ 18-30 మధ్య 3 టీ20లు, 3 వన్డే మ్యాచులు జరగనున్నాయి. వన్డేలకు శిఖర్ ధావన్, టీ20 మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్లుగా కమిటీ నిర్ణయించింది. రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కేఎల్ రాహల్, విరాట్, రోహిత్, దినేశ్ కార్తీక్, ఆర్ అశ్విన్ దూరం కానున్నారు. టెస్టు సిరీస్ నుంచి హనుమ విహారి వైదొలిగాడు.
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్‌యాదవ్.
బంగ్లాదేశ్‌తో వన్డేలకు ఎంపికైన జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్‌కోహ్లీ, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాళ్.
న్యూజిలాండ్‌తో వన్డేలకు ఎంపికైన టీమ్‌ఇండియా జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శభ్‌మన్‌గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్‌యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్‌దీప్ సేన్, ఉమ్రన్ మాలిక్.
న్యూజిలాండ్‌తో టీ20లో ఆడనున్న భారత జట్టు:
హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రిషభ్‌పంత్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్‌యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రన్ మాలిక్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం