ZIM vs IND: టీమ్‌ ఇండియా జింబాబ్వే పర్యటన.. జట్టు ఇదే.. యువ ఆటగాళ్లకు అవకాశం

జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Updated : 24 Jun 2024 19:42 IST

దిల్లీ: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ముగిసిన వెంటనే భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య జులై 6 నుంచి 14 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఇందు కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌లో ఆడిన సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చింది. జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు రియాన్‌ పరాగ్‌, అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.  

భారత్‌.. జింబాబ్వే టూర్‌ షెడ్యూల్ 

  • తొలి టీ20 (జులై 6)
  • రెండో టీ20 (జులై 7)
  • మూడో టీ20 (జులై 10)
  • నాలుగో టీ20 (జులై 13)
  • ఐదో టీ20 (జులై 14) 

జట్టు ఇదే: శుభ్‌మన్‌ గిల్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌ (కీపర్), ధ్రువ్‌ జురెల్‌ (కీపర్), నితీశ్‌రెడ్డి, రియాన్‌ పరాగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, తుషార్‌ దేశ్‌పాండే.

  • ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని