Hardik Pandya: హార్దిక్ సరికొత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన యువ క్రికెటర్..!
ఇన్‌స్టా ఫాలోవర్ల విషయంలో టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) రికార్డు సృష్టించాడు. గ్లోబల్ స్టార్ ప్లేయర్ల కంటే ఇతడినే ఎక్కువ మంది ఫాలో అవడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్‌ఇండియా(TeamIndia) ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్య(Hardik Pandya) మరో అరుదైన ఘనత సాధించాడు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే ఈ స్టార్ క్రికెటర్.. 25 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్ల(Instagram followers)ను సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. గ్లోబల్ స్టార్ ప్లేయర్లు రఫెల్ నాదల్, ఫెదరర్, మాక్స్ వెర్‌స్టాపెన్ తదితరుల కంటే హార్దిక్‌కే ఎక్కువ మంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉండటం విశేషం.
ఈ ఘనత దక్కడంపై పాండ్య అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. ‘నాపై ఇంత ప్రేమను వ్యక్తపరిచిన వారందరికీ నా ధన్యవాదాలు. అభిమానుల్లో ప్రతి ఒక్కరూ నాకు ప్రత్యేకమే. ఇన్నేళ్లు నాకు మద్దతుగా నిలిచి ప్రేమను అందించిన మీకు కృతజ్ఞతలు’ అంటూ పాండ్య ఇన్‌స్టాలో పేర్కొన్నాడు.
కేవలం ఆటతోనే కాకుండా.. స్టైల్ ఐకాన్‌గానూ అభిమానులను అలరించే 29 ఏళ్ల హార్దిక్ పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణి, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ (Natasa Stankovic)ను మళ్లీ పెళ్లి చేసుకొని హార్దిక్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి