T20 World Cup: వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ముందు భారీ లక్ష్యం

టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు భారీ స్కోర్‌ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి.. 188 పరుగులు చేసింది. భారత్‌ ముందు 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా బౌలింగ్‌ ఎంచుకుని.. ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలలో జానీ బెయిర్‌ స్టో (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

Updated : 27 Feb 2024 13:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు భారీ స్కోర్‌ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి.. 188 పరుగులు చేసింది. భారత్‌ ముందు 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా బౌలింగ్‌ ఎంచుకుని.. ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలలో జానీ బెయిర్‌ స్టో (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన మొయిన్‌ అలీ (43) ధాటిగా ఆడాడు. లియామ్‌ లివింగ్‌ స్టోన్ (30) రాణించాడు. జేసన్‌ రాయ్‌ (17), జోస్ బట్లర్‌ (18), డేవిడ్‌ మలన్ (18) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమి మూడు, రాహుల్‌ చాహర్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్‌ తీశారు. టీ 20 ప్రపంచకప్‌ సన్నాహక మ్యాచులో భాగంగా.. దుబాయ్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని