Published : 13 Dec 2021 11:54 IST

IND-SA: మూడు రోజుల క్వారంటైన్‌లో టీమిండియా!

ముంబయి: ఈ వారంలో భారత్‌ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో భారత్‌ 3 టెస్టులు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. కాగా.. కరోనా నిబంధనల కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు భారత జట్టు క్రీడాకారులు మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఇప్పటికే ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కి క్రీడాకారులు చేరుకున్నారు. బయోబబుల్‌లో భాగంగా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే సారథ్యంలో రోహిత్‌ శర్మ, అజింక్య రహానె, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు.

ఈ గ్రూపు మూడు రోజులు క్వారంటైన్‌ పూర్తి చేసుకొని డిసెంబర్‌ 16న దక్షిణాఫ్రికాకు బయలుదేరుతుంది. ఈ సీనియర్‌ ఆటగాళ్ల గ్రూప్‌ అక్కడికి చేరుకున్న తర్వాతనే.. భారత జట్టు జాబితాలో ఉన్న మిగతా ఆటగాళ్లు.. నవదీప్‌ సైనీ, సౌరబ్‌కుమార్‌, దీపక్‌ చాహార్‌, అర్జన్‌ నాన్‌వాస్వల్లమ్‌, హనుమా విహారి, వివేక్‌ రామకృష్ణ(ట్రైనర్‌) దక్షిణాఫ్రికాకు బయలుదేరుతారు. తొలి టెస్టు మ్యాచ్‌ డిసెంబర్‌ 26 సెంచూరియన్‌ వేదికగా జరగనుంది. ఈ జట్టుకు విరాట్‌ కోహ్లీనే సారథ్యం వహించనున్నారు. ఆ తర్వాత జరిగే వన్డే మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని